ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeమెదక్ జిల్లాసమస్యల పరిష్కారానికి గ్రామసభలే వేదికలు 

సమస్యల పరిష్కారానికి గ్రామసభలే వేదికలు 

📰 Generate e-Paper Clip

జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ 

మన తొలివెలుగు, మెదక్ జిల్లా బ్యూరో ప్రతినిధి లింగం రాజ్ :

సమస్యల పరిష్కారానికి గ్రామసభలు సమర్థవంతమైన వేదికలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని గ్రామంలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామసభలో జిల్లా అదనపు కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 4, 6, 8, 10 తేదీలలో గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామసభలో వివిధ శాఖల అధికారులు తమ శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రజలకు అందుబాటులో ఉన్న సేవలపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామ సభల ద్వారా గ్రామస్థుల సమస్యలను తెలుసుకొని త్వరితగతిన పరిష్కరించే అవకాశం కలుగుతుందని అన్నారు. ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియ, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు పంటల సేద్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పారిశుధ్యం, కాలుష్య నియంత్రణ, సురక్షిత తాగునీటి నిర్వహణ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!