ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeయాదాద్రి భువనగిరి జిల్లాభువనగిరిని ప్లాస్టిక్ రహిత మున్సిపాల్టీగా మారుస్తాం

భువనగిరిని ప్లాస్టిక్ రహిత మున్సిపాల్టీగా మారుస్తాం

📰 Generate e-Paper Clip

మన తొలి వెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ :

ప్లాస్టిక్ వాడకం తగ్గించి జీవ విచ్ఛిన్నత చెందే వస్తువులను వినియోగించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు సూచించారు. ప్రజా పాలన ప్రగతి – ప్రణాళిక 99 రోజులలో భాగంగా నల్లగొండ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో శుక్రవారం భువనగిరి రైతు బజార్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులు, వ్యాపారులు, వినియోగదారులు పాల్గొన్న కార్యక్రమంలో నల్లగొండ రీజినల్ ఆఫీస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ఎం. వెంకన్న మాట్లాడుతూ.. తడి పొడి చెత్తను వేరు చేసి సేకరించే అలవాటు చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ మాట్లాడుతూ.. జీవ విచ్ఛిన్నత చెందే సంచులే భవిష్యత్తు బాట గా పేర్కొన్నారు. ప్లాస్టిక్ లేని పరిసరాలు ఆరోగ్యకరమైన జీవనంకు మార్గం సుగమం అన్నారు. ఒక క్లాత్ బ్యాగ్ వాడితే 100 ప్లాస్టిక్ కవర్ తగ్గుతాయి అన్నారు. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగం పర్యావరణ కాలుష్యంతో జీవరాశి కి ముప్పు వాటిల్లనుందని అందరూ బట్ట సంచులను వాడాలని, నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వినియోగించితే భవిష్యత్తు తరాల మనుగడ ప్రశ్నార్ధకం కానుందని, బట్ట సంచులను మాత్రమే వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే.చంద్ర ప్రకాష్ రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎనలిస్ట్ దొంత తేజస్విని, కౌన్సిలర్ లియాకత్ అహ్మద్, పీసీబీ ఫీల్డ్ అసిస్టెంట్ బి రాజేందర్, రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ సాయి కిషోర్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!