ePaper
Tuesday, June 16, 2026
📄 ePaper
Homeయాదాద్రి భువనగిరి జిల్లావిద్యార్థునుల ఆరోగ్యం భద్రతకు ప్రాధాన్యతనివ్వాలి 

విద్యార్థునుల ఆరోగ్యం భద్రతకు ప్రాధాన్యతనివ్వాలి 

📰 Generate e-Paper Clip

విద్యా శాఖ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

హుస్సేనాబాద్ కేజీబీవీని పరిశీలించిన జిల్లా కలెక్టర్

మన తొలి వెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ :

విద్యార్థునుల ఆరోగ్యం భద్రతకు అధిక విద్యాశాఖ అధికారులు ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిఅధికారుల ఆదేశించారు. భువనగిరి పట్టణ పరిధిలోని హుస్సేనాబాద్‌లో ఉన్న కస్తూర్బా గాంధీ బాలిక పాఠశాల (కేజీబీవీ) ను సోమవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి జరిగిన అడ్మిషన్ల వివరాలను కలెక్టర్ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఎన్ని కొత్త అడ్మిషన్లు వచ్చాయని , విద్యార్థినుల హాజరు శాతం ఎలా ఉందని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలో కొనసాగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. పనులు నెమ్మదిగా సాగుతున్న విషయంపై ఆరా తీసిన కలెక్టర్, ఆలస్యానికి గల కారణాలను తెలుసుకుని పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. పాఠశాల స్టోర్‌ రూమ్‌ను తనిఖీ చేసిన కలెక్టర్, అక్కడ నిల్వ ఉంచిన బియ్యం, పప్పు కూరగాయలు నాణ్యతను పరిశీలించారు. విద్యార్థినులకు అందిస్తున్న ఆహారం నాణ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే వంట నూనె ప్యాకెట్లపై ఉన్న గడువు తేదీలను పరిశీలించి, కాలపరిమితి ముగిసిన వస్తువులు వినియోగించరాదని సూచించారు. పాఠశాల ఆవరణను పరిశీలించిన కలెక్టర్, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా, చెత్తాచెదారం పేరుకుపోకుండా పరిశుభ్రత పాటించాలని సూచించారు. విద్యార్థినుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి బిక్షపతి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!