ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణరంగారెడ్డిఆర్య వైశ్యుల ఆరాధ్యదైవం వాసవీ మాత కన్యకాపరమేశ్వరి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం

ఆర్య వైశ్యుల ఆరాధ్యదైవం వాసవీ మాత కన్యకాపరమేశ్వరి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

నేడు శ్రీ శ్రీ శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఉంటుందని వాసవి మాత ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. బడంగ్ పేట్ సర్కిల్ దీన్ దయాల్ నగర్ ఆర్ సి ఐ రోడ్ లో ఆదివారం ఉదయం ఏడు గంటలకు శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి గణపతి స్పటిక లింగ సహిత సరస్వతి ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ తెరేటిపల్లి శ్రీనివాస్ గుప్తా, అధ్యక్షుడు పచ్చిపులుసుల రామచంద్ర మూర్తి గుప్త తెలిపారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత విగ్రహాన్ని అయోధ్య లో శ్రీరాముడు సీతాదేవిలను చెక్కిన శిల్పి తొనే అమ్మవారి విగ్రహాన్ని చెక్కించడం జరిగిందని వివరించారు. శనివారం ఉదయం గురు ప్రార్ధన, ఆవాహిత దేవత పూజ ఆదివాసాంగ హోమం ఘనంగా నిర్వహించారు. ఆదివారం శ్రీ శ్రీ శ్రీ వాసవి మాత కన్యక పరమేశ్వరి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హాజరవుతున్నట్టు తెలిపారు. ఈ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై విజయవంతం చేయాలని ప్రధాన కార్యదర్శి ఇరవేంటి సురేష్ గుప్తా కోశాధికారి, గoదే వెంకటేశ్వర్లు గుప్తా కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!