కమ్మని జ్ఞాపకాల పొదరిల్లు
నూతన గృహంలో అడుగుపెట్టిన వేళ.. కమ్మనైన అనుబంధాల కోవెళ
మన తొలివెలుగు, తెలంగాణ బ్యూరో ప్రతినిధి :
ఇల్లు అనేది కేవలం ఇటుకలు, సిమెంటుతో కట్టిన నిర్మాణం మాత్రమే కాదు. అది మనసులకు ప్రశాంతతను, జీవితానికి అర్థాన్ని ఇచ్చే అనుబంధాల ఆలయం. ఇల్లంటే కేవలం నాలుగు గోడలు, కప్పు మాత్రమే కాదు. అది ప్రేమానురాగాలు, ఆప్యాయతలు వెల్లివిరిసే ఒక కలల సౌధం.. అనే భావన మనందరికీ తెలిసిందే. అలాంటిది నల్లగొండ జిల్లా, పోనుగోడు గ్రామంలో పులకరం కృష్ణయ్య దంపతులకు ఏకైక ప్రేమానురాగాల కూతురు ఉన్నది. వీరు నల్లగొండ పట్టణంలో నివాసముంటూ టిఫిన్ బండి ఏర్పాటు చేసుకొని గత కొన్ని సంవత్సరాలుగా కష్టపడి పని చేస్తూ డబ్బులు జమ చేసుకుని సొంత గ్రామంలో నూతన ఇంటిని నిర్మాణం చేసుకున్నారు. ఎన్నో సంవత్సరాల కల, మా కష్టార్జితం, కట్టుకున్న మా ‘కలల సౌధం’ లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆత్మీయుల మధ్య దేవుని దివ్యానుగ్రహం, పెద్దల ఆశీస్సులు, బంధుమిత్రుల శుభాకాంక్షల నడుమ కూతురు అంజలితో కలిసి నరసింహ స్వామి, శంకర్ స్వామి, శివ స్వామి వేద మంత్రోచ్ఛారణల మధ్య నూతన గృహంలోకి రిబ్బన్ కట్ చేసి ప్రవేశించారు. అనంతరం సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. హోమం జరిపించారు.

గృహప్రవేశ మహోత్సవానికి అక్క వరమ్మ, అన్నదమ్ములు పులకరం కొండయ్య సుగుణ, పద్మనాభం జానకమ్మ, సహదేవ్ కలమ్మ, కుమారుల వరుసైన శ్రీను వరలక్ష్మి, కిషోర్ పావని, అశోక్ దేవి దంపతులు, సాయి, అల్లుళ్ళు కూతుళ్లు దుర్గ ప్రసాద్ అలివేలు మంగ, ముత్తయ్య రాజేశ్వరి, వినయ్ భవాని, అశోక్ భార్గవి, గోపాల్ దుర్గా దంపతులు సకుటుంబ సమేతంగా విచ్చేసి, వారిని ఆశీర్వదించారు. దూర దూరాన నుంచి వచ్చిన కుటుంబ సభ్యులు బంధువులతో ఆత్మీయంగా కష్టసుఖాలను ఒకరికొకరు పంచుకున్నారు.
ఒకే రంగు, ఒకే డిజైన్ ఉన్న చీరలను ధరించి ఆట పాటలతో అలరించిన అక్కా చెల్లెలు

ఈ శుభకార్యానికి అక్కాచెల్లెళ్లు ఒకే రంగు, ఒకే డిజైన్ ఉన్న చీరలను ధరించి సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచారు. వారి తల్లిదండ్రుల పెంపకం వారిద్దరి మధ్య ఉన్న అనురాగానికి ప్రతీకగా ఈ సంఘటన నిలిచింది. అందాలతో, ఆటపాటలతో డీజే మధ్య చిందులతో, తెలంగాణ బతుకమ్మ ఆటల పాటలతో వచ్చిన కుటుంబ సభ్యులందరినీ అలరించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంస్టాగ్రామ్ లో ఆటపాటలతో కూడిన వీడియోలని తీశారు. కుటుంబంలోని సభ్యులు బంధుమిత్రులు స్నేహితులు అంటే ఇలా ఉండాలి అనే విధంగా గ్రామంలో ప్రతి ఒక్కరూ పులకరం కృష్ణ సాలమ్మ దంపతులను అభినందించారు.

