ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణనాగర్‌కర్నూల్కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్టు చేయాలి

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్టు చేయాలి

📰 Generate e-Paper Clip

ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందికొండ గీత డిమాండ్

మన తొలివెలుగు, నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయకాంత్

మైనర్ బాలికపై హత్యాచారం చేస్తే తల్లిదండ్రులు స్వయానా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసిన బండి భగీరథుని అరెస్టు చేయకుండా నిర్లక్ష్యం చేయడం తగదని వెంటనే అరెస్టు చేయాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందికొండ గీత డిమాండ్ చేశారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని 12వ వార్డులో ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు కావడం వల్లనే సామాన్యుడు పెట్టినటువంటి కేసు నీరు గారిచే ప్రయత్నం చేయడం తగదని వెంటనే వారిని అరెస్టు చేయాలని కోరారు. చట్టం సామాన్యులకు ఒకలాగా ధనవంతులకు ఒకలాగా భారతదేశంలో అమలవుతున్న పరిస్థితి ఉందని ఆమె విమర్శించారు. బీజేపీ నాయకులు హిందూ ధర్మం గురించి చెబుతూనే మహిళల పైన అనేక దాడులు అత్యాచారాలకు ఒడిగడుతున్నారని ఆమె అన్నారు. కేంద్ర మంత్రులతో మొదలు పెట్టుకుంటే కిందిస్థాయి కార్యకర్తల వరకు అడుగడుగునా మహిళలను వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ లేకుండా పోతుందని మహాత్ముడు కలలుగన్న రాజ్యం కలలుగానే మిగిలిపోయే విధంగా బిజెపి విధానాలు అమలు చేస్తున్నారని ఆమె అన్నారు.బండి సంజయ్ కుమారుడు కావడం వల్లనే వారిని అరెస్టు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం అండదండలతో కుమారుడు చేసిన తప్పును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సరైనపద్ధతి కాదని వారిని వెంటనే అరెస్టు చేసి బాలిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు జాంగిర్, భాను, సులోచన, రమాదేవి, జ్యోతి, అరుణ, రాజేశ్వరి, పుష్పలత పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!