ePaper
Monday, August 3, 2026
📄 ePaper
Homeమహబూబ్ నగర్ఘనంగా మండేలా, అందెశ్రీ జయంతి వేడుకలు

ఘనంగా మండేలా, అందెశ్రీ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో ప్రతినిధి ఎన్. హరీష్ : 

వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం మహనీయుల స్ఫూర్తి వేదిక ఆధ్వర్యంలో నెల్సన్ మండేలా 108వ జయంతి, ప్రజాకవి డాక్టర్ అందెశ్రీ 65వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదిక రాష్ట్ర చైర్మన్ రాజారాం ప్రకాష్ మాట్లాడుతూ.. జాతి వివక్షపై పోరాడిన నల్లసూర్యుడు నెల్సన్ మండేలా, తన పాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఊపిన లోకకవి అందెశ్రీల జీవితాలు సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు. అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ’ నేడు రాష్ట్ర అధికారిక గీతంగా నిలవడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో కవి గిరిరాజాచారి, డా. నరసింహ శర్మ, గంధం నాగరాజు, దేవన నాయుడు, శ్రీనివాసులు శెట్టి, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!