ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeమహేశ్వరంనంది హిల్స్‌లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన 

నంది హిల్స్‌లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన 

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

కాలనీల అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రశాంతి హిల్స్ డివిజన్ నంది హిల్స్ ప్రాంతంలో రోడ్డు నెం.1 రోడ్డు నెం.3 లో రూ.30 లక్షల వ్యయంతో 325 మీటర్ల పొడవుతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కాలనీల అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన రహదారులు, డ్రైనేజీ, విద్యుత్ వంటి సౌకర్యాలు అందేలా దశలవారీగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సునీత బాలరాజ్, అర్కల కామేష్ రెడ్డి, ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్, సిద్దాల లావణ్య, శ్రీను నాయక్, సుర్వి లత శేఖర్ గౌడ్, కాలనీ వాసులు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!