ePaper
Sunday, May 3, 2026
📄 ePaper
Homeయాదాద్రి భువనగిరి జిల్లానూతన వాటర్ ట్యాంకు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన వైస్ చైర్ పర్సన్ పోతంశెట్టి మంజుల...

నూతన వాటర్ ట్యాంకు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన వైస్ చైర్ పర్సన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ :

భువనగిరి మున్సిపల్ లోని 22వ వార్డు పరిధిలోని ఇందిరానగర్ లో నూతన వాటర్ ట్యాంకు నిర్మాణ పనులకు వైస్ చైర్ పర్సన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని త్వరగా పూర్తీ చేయాలన్నారు. వార్డు కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్ మాట్లాడుతూ.. వార్డు ప్రజల తరపున ఎమ్మెల్యే కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఏఈ సురేష్, చక్రపాణి, యాదగిరి, జాలిగం శివ, మనీష్, వరుణ్, ఉమా మహేష్, భారతి, దినేష్, మహేందర్, మని, శివతేజ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!