ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
Homeమహేశ్వరంబీఆర్ఎస్ నేత అనగొంది కుమార్ ను పరామర్శించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

బీఆర్ఎస్ నేత అనగొంది కుమార్ ను పరామర్శించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :

మాజీ మంత్రి , మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తన నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని, తనవాళ్ళు అనుకున్న వాళ్ళందరికీ భరోసాగా నిలుస్తారని చెప్పడంలో సందేహం లేదు. ఆమె ప్రజలతో, ముఖ్యంగా కార్యకర్తలతో, మహిళలతో, కాలనీ వాసులతో మమేకమవుతూ వారి సమస్యలను పరిష్కరించడంలో ముందుంటారు. బడంగ్ పేట్ సర్కిల్ నాదర్ గూల్ డివిజన్ పరిధిలోని అల్మాస్ గూడకు చెందిన గత కార్పోరేషన్ 25వ డివిజన్ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి అనగొంది కుమార్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి రాజీవ్ గృహకల్పలోని కుమార్ నివాసంలో ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకున్న అనంతరం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఏమీ కాదు.. అధైర్యపడవద్దని ఆరోగ్యం త్వరలోనే కుదుట పడుతుందని అతని భార్య స్వప్న, కుమార్తె దీక్షిత, కుమారులు సందీప్, వరుణ్ లు దిగులు పడద్దని కుమార్ కు ఏమి కాదని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆరోగ్యం విషయంలో దిగులు పడకుండా కుమార్ ధైర్యంగా ఉండాలని, ఆయనకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామిడి రాంరెడ్డి, సంరెడ్డి వెంకట్ రెడ్డి, ముత్యాల కృష్ణ, బోయపల్లి శేఖర్ రెడ్డి, అర్కల కామేష్ రెడ్డి, ఎనుగుల అనిల్ కుమార్ యాదవ్, మహిళా నాయకురాలు గీత, బిందు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!