ePaper
Monday, May 4, 2026
📄 ePaper
Homeతెలంగాణరంగారెడ్డిమనిషి మరణించినా అవయవాల దానం ద్వారా ఇతరులలో బతికే ఉంటారు - మాజీ మంత్రి ఎమ్మెల్యే...

మనిషి మరణించినా అవయవాల దానం ద్వారా ఇతరులలో బతికే ఉంటారు – మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

అవయవ దానం అత్యున్నతమైన దానమని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్ పేట్ సర్కిల్ పెద్ద బావి మల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో మాజీ కార్పొరేటర్ సూర్ణగంటి అర్జున్ మాతృమూర్తి సూర్ణ గంటి నరసమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హాజరై నరసమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నరసమ్మ చనిపోతూ కూడా తన అవయవాలను దానం చేసి కొంత మంది ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు. చనిపోయిన తర్వాత అవయవాలను కాల్చడం ద్వారా బూడిద పాలు, మట్టిలో పాతడం ద్వారా మట్టిపాలు చేయకుండా అవయవ దానం చేసి చిరంజీవులుగా మిగిలిపోవాలని సూచించారు. నరసమ్మ మృతి చెందిన కూడా అవయవాల దానం ద్వారా ఇతరులలో బతికే ఉంటారన్నారు . ఈ కార్యక్రమంలో నాయకులు రామిడి రామిరెడ్డి, పెద్ద బావి ఆనంద్ రెడ్డి, భీమిడి జంగారెడ్డి, ఏనుగు రామ్ రెడ్డి, అర్కల కామేష్ రెడ్డి , నరేందర్ రెడ్డి , మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!