అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
టెంపుల్ సిటీ లో వేద పాఠశాలకు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన
అనంతరం నరసింహున్ని దర్శించుకున్న సీఎం
మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శనివారం యాదగిరిగుట్టలో పర్యటించారు. ఉదయం 8:50 నిమిషాలకు హెలికాప్టర్లో యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కి ప్రభుత్వ విప్ ఆలేర్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఘనంగా స్వాగతం పలికారు. హెలికాప్టర్ నుండి నేరుగా వెళ్లి టెంపుల్ సిటీలో 43 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వేద పాఠశాల పనులకు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. రూ.100 కోట్ల తో చేపట్టనున్న అభివృద్ధి పనుల్లో రూ.43.80 కోట్లతో వేద పాఠశాలకు, రూ.9.87 కోట్లతో కొండపై స్వామివారి నిత్యకల్యాణ మండపం నిర్మాణానికి, రూ.1.41 కోట్లతో వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి పై కప్పు నిర్మాణానికి, రూ.1.35 కోట్లతో రథశాల వైపు మాడవీధులకు మెట్ల నిర్మాణానికి రూ. 43.12 కోట్లతో డార్మిటరీ హాల్స్, దీక్షాపరుల సదనం నిర్మాణానికి ఆయన అక్కడే శంకుస్థాపన చేశారు. అనంతరం యాదగిరి కొండపైకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వయంభులను దర్శనం చేసుకున్న అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం చేపట్టారు. దేవస్థానం ఈవో భవాని ప్రసాద్ ధర్మకర్త నర్సింహమూర్తి లు సీఎం కి మంత్రులకు స్వామి వారి జ్ఞాపిక ను ప్రసాదాలను అందజేశారు. దర్శన అనంతరం 10.55 నిమిషాలకు హెలికాప్టర్ లో సీఎం హైదరాబాద్ కు వెళ్లారు.

ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల షామెల్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ నెళికంటి సత్యం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర చైర్మన్ బండ్రు శోభారాణి, భువనగిరి, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్ పర్సన్లు తంగళపల్లి శ్రీవాణి, గుండ్లపల్లి వాణి పాల్గొన్నారు.

