ePaper
Sunday, May 3, 2026
📄 ePaper
Homeతెలంగాణనాగర్‌కర్నూల్శాస్త్రోక్తంగా శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో అక్షరాభ్యాసాలు చిన్నారులకు అన్నప్రసాలు

శాస్త్రోక్తంగా శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో అక్షరాభ్యాసాలు చిన్నారులకు అన్నప్రసాలు

📰 Generate e-Paper Clip

ఆలయ ప్రధాన అర్చకులు పీ.నవీన్ కుమార్

మన తొలివెలుగు, నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్     

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం సమీపంలోని కొల్లాపూర్ చౌరస్తా దగ్గర గల శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో ఆదివారం నాడు దేవతా నక్షత్రం  అనురాధ నక్షత్రం ఉండటంతో శుభ కార్యాలయంలో భాగంగా
నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల నుండి వచ్చిన చిన్నారులుకు శాస్త్రోక్తంగా 4కి అక్షర భ్యాసాలు, ఇద్దరు చిన్నారులకు అన్నప్రాస కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు పీ.నవీన్ కుమార్ తెలిపారు.
అనంతరం ఆలయంలో భక్తులు అమ్మవారికి సామూహిక అర్చనలు, కుంకుమార్చన నిర్వహించారు.ఈ సరస్వతి దేవాలయంలో ప్రతిరోజు అక్షరాభ్యాసాలు 3 సంవత్సరాల లేదా 5 సంవత్సరాల నుండి చిన్నారులకు చేయనున్నట్లు తెలిపారు. ప్రతిరోజ అన్నప్రాస కార్యక్రమాన్ని 5 నెలలు పూర్తిగా నిండి 6వ రోజు పడిన వారికి అన్నప్రాస కార్యక్రమం వేద మంత్రోచరణనల మధ్య నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారిని దర్శించిన భక్తులందరికీ ఆలయ ఆవరణలో ప్రతిరోజు అన్నప్రసాద వితరణ ఉందని తెలిపారు. అనంతరం భక్తులందరికీ వేద ఆశీర్వచనం తీర్థప్రదల పంపిణీ చేశారు.పూజా వివరాలకు 9441303182 లో సంప్రదించలన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఆకారపు విశ్వనాథం, నరహరి బాలస్వామి, శివకుమార్ నవీన్, భార్గవి, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!