ePaper
Sunday, May 3, 2026
📄 ePaper
Homeతెలంగాణనాగర్‌కర్నూల్కార్మిక పోరాటాలకు అండ ఎర్రజెండ

కార్మిక పోరాటాలకు అండ ఎర్రజెండ

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్   

కార్మికులకు, కర్షకులకు పేదలకు అండ ఎర్రజెండా అని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు పొదిల రామయ్య అన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్  మండలం మంతటి గ్రామంలో పార్టీ జెండా ఎగరవేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. కష్టజీవులకు అండగా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్న జెండా ఎర్రజెండా అని ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రతి సమస్య పైన గలమెత్తుతూ  రైతుల పక్షాన,కార్మికుల పక్షాన, కూలీల పక్షాన,ఉద్యోగుల పక్షాన,అండగా నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తుందని ఆయన అన్నారు. ప్రజలకు ఎక్కడ కష్టాలు ఉంటే అక్కడ ఎర్రజెండా ఉంటుందని ఈ దేశంలో పేదరికం ఉన్నంతవరకు ఎర్రజెండా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు.అందులో భాగంగా రైతులు పండించిన మొక్కజొన్న కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని వెంటనే మక్కలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మధు, శాఖ కార్యదర్శి తిరుపతయ్య, సీపీఎం సీనియర్ నాయకులు శీను, వెంకటయ్య, వెంకట స్వామి, బాలస్వామి, కృష్ణయ్య, రాము, బాలరాజు, వెంకటేష్, కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!