ePaper
Sunday, May 3, 2026
📄 ePaper
Homeతెలంగాణనాగర్‌కర్నూల్పెట్రోల్ డీజిల్ కొరతను నివారించాలి -  కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న

పెట్రోల్ డీజిల్ కొరతను నివారించాలి –  కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పెట్రోల్ డీజిల్ కొరతను నివారించాలని కేవీపీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న మాట్లాడుతూ..  కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ కొరతను వెంటనే నివారించాలని డిమాండ్ చేశారు,దేశంలో నెలకొన్న ఇంధన కొరత కారణంగా సామాన్య ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, మార్కెట్లో పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా చూడాలని ఆయన కోరారు. స్తంభించిన రవాణా, ఇంధన కొరత వల్ల నిత్యావసర వస్తువుల సరఫరాపై ప్రభావం పడి, ధరలు పెరిగే ప్రమాదం ఉందని, ప్రభుత్వ వైఫల్యం చమురు నిల్వలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

తక్షణ చర్యలు తీసుకొని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించకుండా, నిరంతరాయంగా సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ సాయిలు,హుస్సేన్, రాములమ్మ,చిన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!