ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeచాంద్రాయణ గుట్టశ్రీ నల్ల పోచమ్మ ఆలయంలో కొనసాగుతున్న మరమ్మత్తు పనులు

శ్రీ నల్ల పోచమ్మ ఆలయంలో కొనసాగుతున్న మరమ్మత్తు పనులు

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట ప్రతినిధి శైలేష్ కుమార్ :

ఉప్పుగూడ హనుమాన్ నగర్ పరిసర ప్రాంతాల్లో కొలువైన శ్రీ నల్ల పోచమ్మ ఆలయంలో ప్రస్తుతం మరమ్మత్తు, అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆలయం చుట్టూ ప్రహరీ గోడకు మరమ్మతులు చేయడంతో పాటు భక్తుల సౌకర్యార్థం కొత్త మెట్లు, లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులు స్థానిక దాతల సహకారంతో ఈ పనులు చేపట్టారు.

వర్షాకాలం ముందే పనులు పూర్తి చేసి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు ఆలయ నిర్వాహకులు పగలు, రాత్రి అనకుండా పని చేస్తున్నారు. ఆలయ కమిటీ తెలిపిన మేరకు గర్భగుడి చుట్టూ రంగుల పని, కడప రాయి పరిచే పనులు జరగనున్నాయి. భక్తులకు తాగునీటి సౌకర్యం, ఆలయ ఆవరణలో పరిశుభ్రత, పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పనులు పూర్తయిన తర్వాత పునఃప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!