ePaper
Sunday, May 3, 2026
📄 ePaper
Homeతెలంగాణరంగారెడ్డిసీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచేందుకు సీఎం సహాయనిధి ఉన్నదని, అర్హులైన ప్రతి ఒక్కరు సీఎం ఫండ్‌ను సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలం రంగనాయకుల కాలనీకి, చెందిన ఎస్లావత్ లక్ష్మీ అనారోగ్య కారణాలవల్ల అపోలో డీఆర్డీఎల్ హాస్పటల్లో చికిత్స పొందింది. అయితే ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సిఫారసుతో సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు చేసుకోగా ఆమెకు రూ. 40 వేలకు సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కు నిధులు ఆమె భర్త ఇస్లావత్ శ్రీనివాస్ కు జీహెచ్ఎంసీ బడంగ్ బడంగ్ పేట సర్కిల్ కార్యాలయం ఆవరణలో అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్ యాతం పవన్ కుమార్ యాదవ్, నాయకులు రామిడి రామిరెడ్డి, భీముడి జంగారెడ్డి , నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!