మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
మురుగు నీరు సాఫీగా వెళుతుండడంతో లెనిన్ నగర్ వాసులు హర్ష వ్యక్తం చేస్తున్నట్లు టీపీసీసీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 10 ఏళ్లుగా సమస్యలు చుట్టుముడుతున్న లెనిన్ నగర్ కు కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి సహకారంతో దశల వారీగా సమస్యలు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. లెనిన్ నగర్ కట్ట మైసమ్మ టెంపుల్ ఎదురుగ ఉన్న డ్రైనేజ్ అవుట్ లెట్ కు అడ్డుగా ఉన్న మంచి నీటి పైపులైన్ తో లెనిన్ నగర్ లోని డ్రైనేజీ పూర్తిగా పాడై డ్రైనేజీ రోడ్లపై కి వచ్చి స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారన్నారు. సమస్య తెలుసుకున్న కామెడీ గోపాల్ రెడ్డి అధికారులతో మాట్లాడి 2 నెలల్లోళ పనులు పూర్తి చేయించారు. లెనిన్ నగర్లో మురుగు నీరు సాఫీగా వెళుతుండడంతో బస్తీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ, కో ఆప్షన్ సభ్యుడు జెటవత్ రవి నాయక్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు ధరవాత్ స్వామి నాయక్. ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాదరి శ్రీనివాస్, కాంటెస్టెడ్ కార్పోరేటర్స్ నక్క బాలకృష్ణ, మండల యూత్ సెక్రటరీ వరి కుప్పల శివ, గట్టు వీరన్న , పన్నాల సురేష్, కృష్ణ. ఆలేటి నాని, తదితరులు పాల్గొన్నారు
