మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్:
పోచంపల్లి పట్టణంలో చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యుల కోసం నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్‌ను మంగళవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సందర్శించారు. ఈ సందర్భంగా క్యాంపులో చేనేత కార్మికులకు అందిస్తున్న వైద్య సేవలు, హెల్త్ కార్డుల పంపిణీ, వివిధ రకాల వైద్య పరీక్షలు, అందిస్తున్న మందుల వివరాలపై జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని, స్పెషలిస్ట్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అదనంగా మొబైల్ ఎక్స్-రే యూనిట్‌ను కూడా ఈ హెల్త్ క్యాంప్‌లో ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఇలాంటి ఆరోగ్య శిబిరాలను ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా చేనేత, జౌళి శాఖ, వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు, చేనేత, జోలి అధికారి శ్రీనివాస్,గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ భువనగిరి నుంచి స్పెషలిస్ట్ వైద్యులు,డిప్యూటీ డిఎంహెచ్వో చౌటుప్పల్, యశోద డిప్యూటీ డిఎంహెచ్వో భువనగిరి సుమన్ కళ్యాణ్ , పోచంపల్లి వైద్యాధికారి డాక్టర్ శ్రీవాణి,సూపర్వైజర్స్,సిబ్బంది సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
