ePaper
Monday, May 4, 2026
📄 ePaper
Homeతెలంగాణరంగారెడ్డిబడంగ్ పేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య ని సస్పెండ్ చేయాలి 

బడంగ్ పేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య ని సస్పెండ్ చేయాలి 

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

గ్రేటర్ హైదరాబాద్ లోని బడంగ్ పేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య మాజీ మేయర్ల దగ్గరకు వెళ్లి వారి ద్వారా జన గణన యాప్ తో జనగణన ప్రారంభం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీజేపీ రాష్ట్ర కో ఆపరేటివ్ సెల్ కన్వీనర్, రాష్ట్ర నేత కొలన్ శంకర్ రెడ్డి మండిపడ్డారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జన గణన కార్యక్రమాన్ని డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య మాజీ మేయర్ల దగ్గరకు వెళ్లి వారి ద్వార జన గణన యాప్ తో జనగణన కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. బడంగ్ పేట సర్కిల్ లో అధికారికంగా విజిలెన్స్, ఏసీబీ అధికారుల బృందం విచారణ లో రూ. 122 కోట్ల కుంభకోణం జరిగితే 10 మంది అధికారుల సస్పెండ్ అయి ఇంకా విచారణ కొనసాగుతున్న సమయంలో డిప్యూటీ కమిషనర్ ఈ విధంగా వ్యవహరించడం పట్ల వారు అవినీతి అక్రమాలకు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తుంది అన్నారు. ఆధికార పార్టీ అడుగులకు మడుగులు పడుతూ ప్రతిపక్షాలను కించపరచడం సహించరానిదన్నారు. ఈ విషయమై గ్రేటర్ కమిషనర్ కల్పించుకొని డిప్యూటీ కమిషనర్ సమ్మయ్యను వెంటనే సస్పెండ్ చేయాలని కోలన్ శంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. అధికారులు నడక మార్చుకోవాలి.. లేకపోతే నిరసనలతో పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!