ePaper
Monday, May 4, 2026
📄 ePaper
Homeతెలంగాణరంగారెడ్డికటౌట్లు.. ఫ్లెక్సీలు.. పోస్టర్లను.. చించి వేయడం అనేది రాజకీయాల్లో హేయమైన చర్య

కటౌట్లు.. ఫ్లెక్సీలు.. పోస్టర్లను.. చించి వేయడం అనేది రాజకీయాల్లో హేయమైన చర్య

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

కటౌట్లు, ఫ్లెక్సీలు లేదా పోస్టర్లను చించి వేయడం అనేది రాజకీయాల్లో లేదా ప్రజా జీవితంలో హేయమైన చర్య అని ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తుందని, ఉద్రిక్తతలకు దారితీస్తుందని మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సెక్రెటరీ సామ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జన్మదిన సందర్భంగా, సులేమాన్ నగర్ కంటెస్టెడ్ కార్పోరేటర్ ఏర్వ సరిత మహేష్ గురువారం రాత్రి దుర్గా నగర్ చౌరస్తా వద్ద జన్మదిన శుభాకాంక్షల బ్యానర్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే, గుర్తు తెలియని దుండగులు ఆ బ్యానర్‌ను చించి వేశారు, కటౌట్లను కింద పడేశారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోస్టర్లు, ఫ్లెక్సీలు చించడం, కటౌట్లను కింద పడేయడం ఇది అత్యంత ఖండనీయమైన చర్య అన్నారు . ప్రజాస్వామ్యంలో రాజకీయ విభేదాలు ఉండవచ్చు గానీ, ఇలాంటి నీచమైన చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తుందని, ఉద్రిక్తతలకు దారితీస్తుందని ఈ ఘటనపై మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ దురాగతానికి పాల్పడిన బాధ్యులను వెంటనే గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరమన్నారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన భద్రత చర్యలు చేపట్టాలని పోలీసు శాఖను కోరమన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!