ప్రజల గుండెచప్పుడు అలుపెరగని ప్రజా బాటసారి, జనం మెచ్చిన సబితా ఇంద్రారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
పేదల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రజల గుండెచప్పుడు అలుపెరగని ప్రజా బాటసారి ప్రజలే దేవుళ్ళు.. సమాజమే దేవాలయంగా.. భావించే మాజీ విద్యాశాఖ మంత్రి , మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి జన్మదిన వేడులను మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో 1001 కొబ్బరికాయలను కొట్టారు.

అనంతరం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో 50 మంది రక్తదానం చేశారు. భారీ కేక్ కట్ చేసివ ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. అనంతరం 2 వేల మందికి పైగా అన్నదానం నిర్వహించారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు అర్కల కామేష్ రెడ్డి, సునీత బాలరాజు, బీరప్ప, ఎనుగుల అనిల్ కుమార్ యాదవ్, యాతం పవన్ కుమార్ యాదవ్, మాదిరి రమేష్ , లక్ష్మన్, మహిళా నాయకురాలు ఎంటోరి గీత రవికుమార్, పతంగి మాధవి, గాయత్రి, స్నేహలత , బిందు, దేవి, దేవిక తదితరులు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ అనే సంకల్పంతో మహేశ్వరం నియోజకవర్గ బ్రతుకు చిత్రాన్ని మార్చిన ఘనత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికే దక్కుతుందన్నారు. ఎన్నికల సమయంలోనే జనాలకు కనబడతారు కొంత మంది నాయకులు. మళ్లీ ఐదేళ్లు మాయమవుతారు కానీ ఎన్నికల సమయంలోనూ ఎన్నికల అనంతరం నిత్యం ప్రజల మధ్యలో ఉండేది సబితా ఇంద్రారెడ్డి మాత్రమే అన్నారు. భవిష్యత్తులో మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకుంటూ ఉన్నత పదవులు చేపట్టి మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.

