సబితా ఇంద్రారెడ్డి జన్మదినం సందర్భంగా ప్రజలకు మజ్జిగ పంపిణీ చేసిన- సాంబశివ
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేసే నాయకురాలు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అని మహేశ్వరం నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ సిల్వేరి సాంబశివ అన్నారు.
మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలాపూర్ చౌరస్తాలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేసవి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మహేశ్వరం నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ సిల్వేరి సాంబశివ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా రోడ్డుపై ప్రయాణిస్తున్న పాదచారులు, వాహనదారులు, స్థానిక ప్రజలకు మజ్జిగ పంపిణీ చేసి సేవా భావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేసే నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి గారేనని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆమె చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఆమె భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దిండు భూపేష్ గౌడ్, శీను నాయక్, అనిల్ యాదవ్, పూర్ణేశ్వర్ రెడ్డి, రమేష్, రాజ్ కుమార్, రోహిత్, అరవింద్ గౌడ్, నితీష్, రాళ్లబండి కుమార్, జస్వంత్, నూర్జహాన్, అక్బర్ ఖాన్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

