మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేదల సొంతింటి కల సాకారం అవుతుందని లేమూర్ గ్రామ మాజీ సర్పంచ్ గూడూరు కొండారెడ్డి, మాజీ మండల యూత్ అధ్యక్షుడు డిల్లి శ్రీధర్ ముదిరాజ్ అన్నారు. కందుకూరు మండలం లేమూర్ గ్రామంలో పాల్వాయి కవిత అశోక్, జక్కుల సంతోష జంగయ్య నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం శుభ వాతావరణంలో లేమూర్ గ్రామ మాజీ సర్పంచ్ గూడూరు కొండారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్బంగా గృహప్రవేశం చేసిన దంపతులకు కొండారెడ్డి నూతన వస్త్రాలు వారి స్వంత ఖర్చు తో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ ఎలుక మేఘనాత్ రెడ్డి, మాజీ మండల్ యూత్ అధ్యక్షుడు డిల్లి శ్రీధర్ ముదిరాజ్, గ్రామ శాఖ అధ్యక్షులు మహమ్మద్. రహీమ్ , గ్రామ ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు మంచాల భాస్కర్, గుల్వి దేవేందర్,పంచాయితీ సెక్రెటరీ సాయి, రెండవ వ వార్డ్ మెంబర్ కాశం శెట్టి శేఖర్, బూత్ కమిటీ మెంబర్ మొహమ్మద్ అఖిల్ అహ్మద్ ఎస్సీ సెల్ సెల్ అధ్యక్షుడు డప్పు పోచయ్య, వైస్ ప్రెసిడెంట్ గుర్రం సత్తయ్య, సీనియర్ నాయకులు గుల్వి జంగయ్య ,గూడూరు రవీందర్ రెడ్డి పాల్గొని వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా నూతన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. అనంతరం ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కొండారెడ్డి మాట్లాడుతూ.. 2023 ఎన్నికల సందర్బంగా ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారెంటీలు ప్రకటించిందన్నారు. ఈ గ్యారంటీలలో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగాంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా, సొంత స్థలం ఉండి ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తూ, గృహప్రవేశాలు (ప్రారంభోత్సవాలు) చేయడం జరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజల్లో ఆనందం వెల్లి విరిసి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ఫలితంగా ప్రతి కుటుంబం సొంత ఇల్లు కల సాకారం అవుతుందనే ఆశాభావం వ్యక్తమైందన్నారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కల నెరవేర్చడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ఈ కార్యక్రమం లో జంగిలి మహిపాల్, డి.జె దర్శన్, ముచర్ల ఆనంద్, చిన్నగాళ్ల రమేష్, గంగరి జగన్, పులి వెంకటేష్, మంగ, లక్ష్మమ్మ, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.

