ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeయాదాద్రి భువనగిరి జిల్లాగుండెపోటుతో జంగిటి బాలరాజు మృతి

గుండెపోటుతో జంగిటి బాలరాజు మృతి

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ 

 

భువనగిరి పట్టణంలోని 7వ వార్డు హనుమాన్ వాడకు చెందిన జంగిటి బాలరాజు (42) గురువారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబసభ్యుల వివరాలు ప్రకారం…గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత ఇంటి మిద్దపైన నిద్రించాడు. తెల్లవారేసరికి నిద్రలోనే గుండెపోటుతో మరణించినట్లు వారు తెలిపారు. మృతునికి ముగ్గురు కుమారులు, భార్య ఉన్నారు. బాలరాజు మరణంతో ఆ కుటుంబానికి జీవనోపాధి పోయింది. ముగ్గురు చిన్నపిల్లలు కావడంతో ప్రభుత్వం వారిని ఆదుకోవాలని వార్డు ప్రజలు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న వార్డ్ కౌన్సిలర్ కుక్కదూవు పద్మావతి సోమయ్య, వార్డు నాయకులు ఆకుల మురళి, కొలుపుల వివేకానంద్, కొలుపుల అమరేందర్, పిట్టల రాజు, కొండ్రి రాము, జంగిటి రమేష్ లు మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!