ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeతెలంగాణరంగారెడ్డిఘనంగా ముత్యాలమ్మ తల్లి శాంతి కళ్యాణం 

ఘనంగా ముత్యాలమ్మ తల్లి శాంతి కళ్యాణం 

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

జీహెచ్ఎంసీ మీర్ పేట్ 60వ డివిజన్ లోని కమల నెహ్రూ నగర్ కాలనీలో శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవత పున ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ఆదివారం అమ్మవారికి శాంతి కళ్యాణం ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. వేద పండితులు వేద మంత్రోచరణల మధ్య అమ్మవారి కళ్యాణం కొనసాగింది. భక్తులు విచ్చేసి అమ్మవారి కళ్యాణాన్ని కనులారా వీక్షించి దన్యులయ్యారు.

 

ఈ సందర్భంగా మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ తీగల విక్రం రెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు ఎనుగుల అనిల్ కుమార్ యాదవ్, ధనలక్ష్మి రాజకుమార్ కంటెస్టెడ్ కార్పొరేటర్ అబ్బనమోని గోపి యాదవ్ అలాగే ఆలయ కమిటీ చైర్మన్ బొమ్మ కంటి దయానంద్ ముదిరాజ్, కుమార్ ముదిరాజ్, సాయం వెంకటేష్ ముదిరాజ్, పులకరం శివశంకర్ ముదిరాజ్ ఐతరాజు వెంకట్, మేకల కృష్ణ ముదిరాజ్, రామకృష్ణ ముదిరాజ్, , దిండు మహేందర్, ముక్కాముల లక్ష్మణ్ యాదవ్, బక్కతట్ల కృష్ణ యాదవ్, వనం నరసింహ్మ తదితరులు పాల్గొని అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!