ఆరోగ్యమే మహాభాగ్యం అనే సందేశంతో నిర్వహించే 2కే రన్
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో, శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ నడక లేదా పరుగును అలవాటు చేసుకుంటే నిత్యం ఆరోగ్యంతో ఉంటామని అమీర్ పేట్ యూత్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కంది యాదగిరి అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్ పేట్ యూత్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన, 600 మంది తో 2 కే రన్ కార్యక్రమంలో స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కంది యాదగిరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి జెండా ఊపి ఈ పరుగును ప్రారంభించారు. యువత పరుగులు పెట్టారు. ఈ సందర్భంగా కంది యాదగిరి మాట్లాడుతూ.. 600 మంది 2 కే రన్ లో పాల్గొనడం సంతోషకరమన్నారు. సమాజంలో ఫిట్‌నెస్, శారీరక శ్రమ, ప్రతిరోజూ పరుగు లేదా నడక ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ రన్‌ను నిర్వహించినట్టు తెలిపారు.
యువత తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, దురలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడలు, శారీరక దృఢత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు కంది యాదగిరి సూచించారు. ఈ 2కే రన్‌లో స్థానిక ప్రజలు, క్రీడాకారులు, యువతీ యువకులు అసోసియేషన్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు. ప్రజలు ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలన్నారు.
యువత , విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అమీర్ పేట్ యూత్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, పరుగు పందాలలో ప్రతిభ కనబరిచిన విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందించారు.

ఈ కార్యక్రమంలో అమీర్ పేట్ యూత్ స్పోర్ట్స్ వైస్ ప్రెసిడెంట్ డప్పు జనార్ధన్, జనరల్ సెక్రెటరీ బసవ యాదగిరి గౌడ్, జాయింట్ సెక్రెటరీ కమ్మరి నరేష్, బస్వ సందీప్ గజ్జల శ్రీనివాస్, చంద్రశేఖర్,సర్పంచ్ పోతుల మల్లమ్మ, ఉపసర్పంచ్ చేగురీ చంద్రకళ, వాడు సభ్యులు, గ్రామ పెద్దలు క్రీడాకారులు, యువతి ,యువకులు 2k రన్ లో ఉత్సాహంతో పాల్గొన్నారు.

