క్రీడలతో స్నేహభావం, ముదిరాజుల ఐక్యతకు, యువతకు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి.
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
క్రికెట్ ఆట యువతకు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ , కందుకూరు మండల మాజీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ డిల్లి శ్రీధర్ ముదిరాజ్ అన్నారు. లేమూర్, సరస్వతి గూడా, అగర్ మియా గూడా మూడు గ్రామాల ముదిరాజ్ ప్రీమియర్ లీగ్ (ఎఎస్ఎల్) టోర్నమెంట్ ఏప్రిల్ 12 నుండి మే 17 వరకు ఐదు వారల వరకు నడిచి విజవంతంగా ముగిసింది. ఇందులో మొత్తం ఆరు టీమ్ లు నకుల సేన, అర్జున సేన, సహదేవ సేనా, ధర్మసేన, కర్ణసేన, భీమసేన జట్లు పాల్గొన్నాయి. అందులో నకుల సేన కెప్టెన్ కాల్వ త్రినాథ్ ఆధ్వర్యంలో నకుల సేన టీమ్ సహదేవసేన టీమ్ పై ఘన విజయం సాధించడం జరిగింది. ఈ సందర్బంగా మాజీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ డిల్లి శ్రీధర్ ముదిరాజ్ మొత్తం ట్రోపీలు స్పాన్సర్ చేశారు. గెలిచినా టీమ్ కు ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తో కలిపి డిల్లి శ్రీధర్ ముదిరాజ్ ట్రోపిని బహుకరించారు. ఏఎస్ఎల్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక పరుగులు సాధించినందుకు మ్యాన్ అఫ్ ధ సిరీస్ అవార్డు భాషమోని బాలమురళి కృష్ణకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యంగా నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలిలో, ఆటలు మానసిక ప్రశాంతతకు దోహదపడతాయని తెలిపారు. క్రీడల వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు, క్రమశిక్షణకు, ముదిరాజుల ఐక్యతకు, నాయకత్వ లక్షణాలు అలవడతాయని పేర్కొన్నారు. నేటితరం విద్యార్థులు, యువతరం టెక్నాలజీ వైపు దూసుకెళ్తున్న ఈ తరుణంలో క్రీడలపై ఆసక్తిని పెంపొందించేలా క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడలతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం పెంపొందడంతో పాటు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతాయన్నారు. ప్రపంచంతో పోటీ పడుతూనే ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శరీరానికి సరైన వ్యాయామం లేకపోతే రోగాల బారినపడే అవకాశం ఉంటుందన్నారు. ఒకే చోట కూర్చొని కంప్యూటర్ ఉద్యోగం చేసే వారు తప్పనిసరిగా ప్రతిరోజూ కొంత సమయాన్ని వ్యాయామం లేదా క్రీడలకు కేటాయించాలని సూచించారు . ఈ కార్యక్రమం లో అగర్ మియా గూడా, సరస్వతి గూడా, లేమూర్ గ్రామ ముదిరాజ్ అటగాళ్ళు , నిర్వాహకులు డిల్లి బాల కృష్ణ, ఎడ్ల బాలకృష్ణ, భాషమోని కిరణ్, మాదరమోని. సురేష్, చింతకింది వినీష్ , కాల్వ వంశీ, బుసరామోని నవీన్ , మాజీ సర్పంచ్ డిల్లి గణేష్, సరస్వతి గూడా ఉప సర్పంచ్ బుసరామోని భాస్కర్, బొద్రమోని నరేందర్, నీరటి పాండు, కాల్వ విష్ణు, ఎడ్ల నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

