ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeమహేశ్వరంసభ్యత్వాలకు సిద్ధంగా ఉండండి – సామ మహేందర్ రెడ్డి పిలుపు

సభ్యత్వాలకు సిద్ధంగా ఉండండి – సామ మహేందర్ రెడ్డి పిలుపు

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైనా నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సామ మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. కందుకూరు మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకుడు మాజీ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి గ్రామం, ప్రతి బూత్ స్థాయిలో పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని ప్రతి మండలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల వద్దకు వెళ్లి భారీ ఎత్తున సభ్యత్వాలను నమోదు చేయించాలని, పార్టీ బలోపేతానికి అందరూ ఐక్యంగా పనిచేయాలని ఆయన కోరారు. అలాగే రాబోయే ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గాన్ని గులాబీ మయం చేసి, మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మరోసారి భారీ మెజారిటీతో గెలిపించి బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగర వేయాలని సామ మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు బలోపేతం చేసి, ప్రతి కార్యకర్త పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!