ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeమహేశ్వరంచైతన్య తేజం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ ఎస్ ప్రతాప్ రెడ్డికి దక్కిన అరుదైన గౌరవం

చైతన్య తేజం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ ఎస్ ప్రతాప్ రెడ్డికి దక్కిన అరుదైన గౌరవం

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ ఫర్ లీడర్షిప్ అండ్ ఎక్స్లెన్స్ ఆధ్వర్యంలో చైతన్య తేజం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ ఎస్. ప్రతాప్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ మీర్ పేట్ బాలాపూర్ చౌరస్తాలో 2009 లో చిన్నగా 40 మంది విద్యార్థుల నుండి 400 పైచిలుకు విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందిస్తూ రాష్ట్ర స్థాయిలో జూనియర్ కాలేజ్ కి మంచి పేరు గుర్తింపు తెచ్చింది. అదేవిధంగా సోషల్ యాక్టివిటీలో తను సంపాదించిన దాంట్లో సామాన్య ప్రజలకు పేద విద్యార్థులకు సేవా దృక్పథంతో ముందుకు సాగుతూ మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్న ఎస్ ప్రతాప్ రెడ్డి ని యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ గుర్తించి హానరీ డాక్టరేట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ చెన్నైలోని భారతీయ విద్యా భవన్ ఆడిటోరియంలో ఎంతోమంది విద్యావంతులు ఇంటలెక్చువల్స్ ముందు ఘనంగా సత్కారం చేసి ప్రధానం చేయడం జరిగింది.

డాక్టరేట్ వచ్చిన శుభ సందర్భంగా సోమవారం బాలాపూర్ చైతన్య కాలేజ్ లో విద్యాబోధన అందించే లెక్చరర్స్ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ గొంగడి శీనన్న, లెక్చరర్స్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!