ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణమతలబేంటో..? కేవలం 2 ఇళ్ళు @ రూ. 70 లక్షల సీసీ రోడ్డు 

మతలబేంటో..? కేవలం 2 ఇళ్ళు @ రూ. 70 లక్షల సీసీ రోడ్డు 

📰 Generate e-Paper Clip

ప్రారంభించిన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి 

వందల ఇండ్లు ఉన్న కాలనీలకు మొండి “చెయ్యి”

డ్రైనేజీ, సీసీ రోడ్లు, మౌలిక వసతులు కరువు 

కమీషన్ల కోసం.. ఎమ్మెల్యేను తప్పుదారి పట్టిస్తున్న అధికారులు 

ప్రజలు లేని చోట రూ. 70 లక్షలు రోడ్డు పాలా..?

ఇదెక్కడి చోద్యం.. అంటూ ముక్కున వేలేసుకుంటున్న స్థానిక ప్రజలు..! 

మేం పన్నులు కట్టడం లేదా..? అంటూ ప్రశ్నిస్తున్న పలు కాలనీల ప్రజలు

 

మన తొలివెలుగు, తెలంగాణ బ్యూరో ప్రతినిధి

ప్రజల కొరకు.. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి ఆయన. మెజార్టీ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం సేవ చేసే మహోన్నత పదవిని ప్రజలు ఆయనకు కట్టబెట్టారు. కానీ సదురు ఎమ్మెల్యే మెజార్టీ ప్రజల మౌలిక వసతులను గాలికి వదిలేశాడని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. వందలాది ఇండ్లు ఉన్న కాలనీల ప్రజలకు మొండి ‘చెయ్యి’ చూపి కేవలం రెండిండ్లు మాత్రమే నిర్మాణమైన కాలనీలో రూ.70 లక్షల నిధులు వెచ్చించి సీసీ రోడ్డు నిర్మించడమే ఎందుకు కారణం. ఇది ఎమ్మెల్యే అవగాహన రాహిత్యమా.. లేక అధికారుల కమీషన్ల కక్కుర్తి కోసమా.. అని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి చర్యలతో ఎమ్మెల్యే ప్రతిష్ట మసకబారుతుందని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదెక్కడి చోద్యం ఎమ్మెల్యే సారూ..!

చట్టం ఉన్నవాళ్లకే చుట్టమవుతుంది.. అనడానికి ఉదాహరణ కేవలం 2 ఇండ్లు ఉన్న రహదారికి రూ. 70 లక్షల వ్యయంతో నిర్మాణం పూర్తయిన సీసీ రోడ్డును ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని స్కూప్స్ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఎదురుగా శ్రీ లక్ష్మీపురం కాలనీలో కేవలం రెండు ఇండ్లు మాత్రమే ఉన్నాయి. మరో ఇంటి నిర్మాణం జరుగుతుంది. ఈ రహదారికి రూ.70 లక్షల వ్యయంతో అధికారులు రోడ్లు అభివృద్ధి చేశారు. మరి పదుల సంఖ్యలో ఉన్న కాలనీలలో వందల కుటుంబాలు డ్రైనేజీ, సీసీ రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కేవలం రెండు ఇండ్లు ఉన్న కాలనీకి మాత్రమే రూ. 70 లక్షలు వ్యయంతో సీసీ రోడ్డు అభివృద్ధి పనులు చేయడంతో ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది. ప్రజలు ఎక్కువగా ఉన్నచోట అభివృద్ధి పనులు చేయాల్సిన ప్రజల చేత ఎన్నుకోబడిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అధికారుల మాయలోపడి ప్రజలు లేనిచోట అభివృద్ధి పనులు చేయడం ఏంటని..? ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

అవగాహన లోపమా.. అధికారుల కమీషన్ల కక్కుర్తినా..?

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అపూర్వ అనుభవం కలిగిన ప్రజా ప్రతినిధి. ప్రజా సమస్యలపై లోతైన అనుభవం ఉన్న మహోన్నత నేత. అలాంటి ప్రజా ప్రతినిధి.. ఇలాంటి చర్యలతో స్థానిక ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే అవగాహన లోపమా.. లేక అధికారులు కమీషన్ల కోసం.. తప్పుదారి పట్టించారా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ కమీషన్ల కోసమే అయితే.. వందల కుటుంబాలు ఉన్న కాలనీలలో సిసి రోడ్ల నిర్మాణ పనులు చేపట్టిన అదే కమీషన్ ముడుతుంది కదా.. అని చర్చించుకుంటున్నారు. మరి ఆ కాలనీలో ఉన్న రెండు ఇండ్ల కోసం రూ. 70 లక్షల ఖర్చు పెట్టి సీ సీ రోడ్డు నిర్మాణం చేపట్టడం కాంట్రాక్టర్ ముట్టజెప్పే కమీషన్ కోసమా.. లేక ఇక్కడ ప్రభావితం చేసిన వ్యక్తులు వ్యవస్థలు ఏమిటనే చర్చ మొదలైంది.. ఇప్పటికైనా ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ప్రజాహితం కోసం ఆచితూచి ముందుకు సాగాలని.. స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!