ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeయాదాద్రి భువనగిరి జిల్లాదళితులపై వివక్ష చట్ట ప్రకారం నేరం

దళితులపై వివక్ష చట్ట ప్రకారం నేరం

📰 Generate e-Paper Clip

దళిత సమస్యల పరిష్కారం కోసమే పౌర హక్కుల దినోత్సవం

డీవీఎంసీ సభ్యులు బర్రె సుదర్శన్

మన తొలి వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్

దళితులపై కుల వివక్ష, అంటరానితనం పాటిస్తే చట్ట ప్రకారం నేరమని, వారిపై కేసులు నమోదు చేస్తామని, దళితుల సమస్యల పరిష్కారం కోసమే ప్రతి నెలా చివరి రోజున పౌర హక్కుల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బర్రె సుదర్శన్ తెలిపారు. శనివారం భువనగిరి మండలం చీమల కొండూరు గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో జరిగిన పౌర హక్కుల దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో భువనగిరి డిప్యూటీ తహశీల్దార్ కళ్యాణ్ మాట్లాడుతూ.. గ్రామాల్లో కుల వివక్ష, అంటరానితనం చట్టప్రకారం నేరమని, ఎవరైనా పాల్పడినా, ప్రోత్సహించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థకు, బడి ఈడు పిల్లలు బడికి దూరమైన బాలల హక్కులకు భంగం కలిగినట్లే అని వివరించారు. ఈ సమావేశంలో పోలీస్ శాఖ (జందార్) వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ వడ్డే హరికృష్ణ, పంచాయతీ కార్యదర్శి ఈరబోయిన చంద్రయ్య, గ్రామ పాలన అధికారి బొట్ల రమేష్, హెల్త్ అధికారులు దివ్య, పుష్ప, అంగన్వాడీ టీచర్ రాజ్యలక్ష్మి, గ్రామస్తులు లక్ష్మీ నర్సయ్య, రమేష్, పాండు, దేవయ్య, లక్ష్మీ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!