మన తొలి వెలుగు : యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్
ప్రజాస్వామిక తెలంగాణకై పోరాడుదామని తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి కావలి యాదయ్య, జిల్లా అధ్యక్షులు కాశపాక మహేష్, జిల్లా కార్యదర్శి రాసాల నర్సింహాలు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని అమరుల స్తూపం వద్ద ప్రజాస్వామిక తెలంగాణ అమరల వారోత్సవాల కరపత్రం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రత్యేక ప్రజాసామిక తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో అనేక నిర్బంధాలను ఎదిరించి పోరాడి ఎంతో మంది అమరుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. ఉద్యమ సందర్బంలో ఆంధ్ర వలస పాలకుల దోపిడి రాజ్యం నరహంతక హంతక ముఠా నయీంతో తెలంగాణ నినాదంతో పనిచేసిన తెలంగాణ కళా సమితి కో కన్వీనర్ బెల్లి లలిత, నుంచి మొదలుకొని ఆకుల భూమయ్య, వరకు అనేక మందిని హత్య చేసి ఉద్యమాన్ని ఆపాలనే ప్రయత్నం చేసిందన్నారు. కానీ ఆ అత్యాకాండలను ఆ అనిచివేతలను నిర్బందాలను ఎదిరించి తెలంగాణ ప్రజానీకం ప్రజాస్వామ్య తెలంగాణ స్పూర్తితో పట్టుదలతో ముందుకు నడిచిందని తెలంగాణ ప్రజా ఫ్రంట్ అనేక ఉద్యమ శక్తులను ఏకం చేసి ప్రతి సందర్భంలో స్పష్టమైన అవగాహనను అందిస్తూ రాజకీయ పార్టీల కపట నాటకాన్ని బయటపెడుతూ తెలంగాణ జన సభ నుండి తెలంగాణ ప్రజా ఫ్రంట్ గా తెలంగాణ ఉద్యమాన్ని అనునిత్యం కాపాడుకుంటూ ఉద్యమంలో క్రియాశీల పాత్ర నిర్వహిస్తూ వచ్చిందన్నారు. జూన్ 2న హైదరాబాద్ లో జరుగుతున్న తెలంగాణ అమరుల వారోత్సవాల సభలో ప్రజలు ప్రజాస్వామ్య వాదులు విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రాపోలు పవన్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్ సామ మల్లారెడ్డి, బత్తుల సిద్దేశ్వర్, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మైలారం సత్తయ్య, రాసాల బాలస్వామి, చిక్కుల కరుణాకర్, షేక్ అమీద్ పాషా, రాసాల దయాకర్, బాల నరసయ్య, కుకుట్ల శ్రీశైలం, ముక్క జాగ్రుత్, శివ పాల్గొన్నారు.

