రహదారి చెరువు కుంటలా మారుతున్న వైనం
సమస్యను పరిష్కరించాలని సర్పంచిని, అధికారులను వేడుకుంటున్న కాలనీవాసులు
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య :
మహేశ్వరం మండల కేంద్రంలోని 12వ వార్డు బుడగ జంగాల కాలనీ లో పాత విజయలక్ష్మి థియేటర్ వెనకాల చినుకు పడితే చాలు కాలనీ మొత్తం బురద మయంగా మారి కాలనీ వాసులు ఈ రహదారిలో ప్రయాణించాలంటే తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా డ్రైనేజ్ ఏర్పాటు చేసినా కూడా రహదారి సమాంతరంగా లేకుండా ఎత్తు పల్లాలుగా ఉండడంతో చిన్నపాటి వర్షం పడితే చాలు రహదారి అంతా చెరువు కుంటలా తయారవుతుంది. రహదారులో ప్రయాణించే వృద్ధులు, చిన్నారులు జారిపడి ప్రమాదాల బారినపడుతున్నారు. ద్విచక్ర వాహనాలు ప్రయాణించలేని పరిస్థితి నెలకొంది. సంవత్సర కాలం నుంచి ఇబ్బంది పడుతూనే ఉన్నామని ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన ఎవరు పట్టించుకోవడంలేదని కాలనీ వాసులు తెలిపారు. మరి వర్షాకాలంలో భారీ వర్షాలు వస్తే పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాలనీ వాసులు. గ్రామపంచాయతీ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి కలిసి ఫిర్యాదు చేసినా కూడా, గతంలో పని చేసిన సర్పంచ్ కు, ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఈ రహదారులో మట్టిని పోసి చదును చేస్తే తాత్కాలికంగా సమస్య తీరుతుందని కాలనీ వాసులు అంటున్నారు. శాశ్వత పరిష్కారంగా సీసీ రోడ్డు ఏర్పాటు చేసే విధంగా ప్రస్తుత సర్పంచ్, వార్డు మెంబర్ కృషి చేయాలని తెలిపారు. అంతేకాకుండా ఈ కాలనీలో విద్యుత్ స్తంభం లేకపోవడంతో రాత్రిళ్ళు చిమ్మ చీకటిగా ఉండి కాలనీ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నామని. మహేశ్వరం సర్పంచ్, వార్డు మెంబర్, గ్రామపంచాయతీ అధికారులు చొరవ తీసుకుని విద్యుత్ స్తంభం ఏర్పాటు చేసి లైట్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

