మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ
మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టి.రమేష్ :
అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద లబ్ధిదారులకు మెరుగైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కే.పీ. వివేకానంద్ ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరు చేయించిన ఎల్ఓసీ పత్రాలను చింతల్ లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయా డివిజన్లకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు లబ్దిదారులకు అందజేశారు. ఎల్వోసీ పత్రాల అందజేతలో భాగంగా సూరారం డివిజన్ కు చెందిన పమిడిపాటి నాగలక్ష్మీ కేరాఫ్ పీ. రామాచారి రూ.75,000/-(డెబ్భై ఐదు వేల రూపాయలు)కి మంజూరు కాగా సీఎంసీ దుండిగల్ సర్కిల్ పరిధి దుండిగల్ కి చెందిన కుంటి యాదయ్య తండ్రి కే. రామయ్యకు రూ.2,75,000/- (రెండు లక్షల డెబ్భై ఐదు వేల రూపాయలు) మంజూరయ్యాయి.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, ప్రధాన కార్యదర్శి ఎం.డీ.సిద్దిక్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, హెచ్ఏఎల్ బషీరుద్దీన్, లక్ష్మణ్, నాగరాజు చారి, నర్సింగ్, ఖలీమ్, సంధ్యా రాణి తదితరులు పాల్గొన్నారు.

