బీజేపీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు, కాలనీవాసులు
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య :
పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం, గుర్తింపు ఉంటుందని మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జ్ అందెల శ్రీరాములు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బడంగ్ పేట్ సర్కిల్ లో గల మీర్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు తులసి ముఖేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు మేకల కృష్ణ, వివిధ కాలనీ వాసులు నాదర్ గూల్ లోని మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జ్ అందెల శ్రీరాములు సమక్షంలో 100 మంది పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీరాములు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం శ్రీరాములు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై విశ్వాసంతో ప్రజలు పెద్ద ఎత్తున బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం, గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కార్యదర్శులు నీలా రవినాయక్, విజయ లక్ష్మీ రాజు ముదిరాజ్ , ప్రధాన కార్యదర్శి సిద్దాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు సుల ప్రభాకర్, తులసి వెంకటేశ్వర్లు, కిషోర్, తుమ్మల రమేష్, జగన్ ముదిరాజ్, భాస్కర్, శ్రీను, శశి, లక్ష్మణ్, లింగస్వామి, సత్యనారాయణ, వెంకట్, మెరుగు శంకర్, రవికుమార్, శ్రీనివాస్, జి శ్రీనివాస్, రమేష్, బండి వెంకటేష్, మల్లయ్య, మహేష్, వెంకటేష్, సైదులు, సిద్ధార్థ, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

