ePaper
Monday, August 3, 2026
📄 ePaper
Homeకుత్బుల్లాపూర్సమస్యల పరిష్కారానికి కృషి

సమస్యల పరిష్కారానికి కృషి

📰 Generate e-Paper Clip

జీడిమెట్ల 132వ డివిజన్ లో పర్యటించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత సింహారెడ్డి

మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ :

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల 132వ డివిజన్ (కుత్బుల్లాపూర్ డివిజన్) పరిధి శ్రీరామ్ నగర్ (గాయత్రి నగర్)లో కాలనీ మరియు అపార్ట్మెంట్ వాసులు రోడ్లు, స్ట్రీట్ లైట్స్, స్పీడ్ బ్రేకర్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని తెలియజేయడంతో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత సింహారెడ్డి శ్రీరామ్ నగర్ కాలనీతో పాటు అనీష్ గెలాక్సీ అపార్ట్మెంట్, అంబియన్స్ అపార్ట్మెంట్, వాసవి నందనం అపార్ట్మెంట్, సంధ్యా వర్షిని అపార్ట్మెంట్స్, ఎంఎల్ఎన్ కాలనీ వాసులతో కలిసి అపార్ట్మెంట్స్ పరిసరాలలో పర్యటించారు. కాలనీ మరియు అపార్ట్మెంట్ వాసులు ఎదుర్కొంటున్న సమస్యల యొక్క వివరాలను అడిగి తెలుసుకుని సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరారు.

ఈ కార్యక్రమంలో (ఆనీష్ గాలక్సీ అపార్ట్మెంట్ వాసులు) పాపయ్య దొర, గంగేశ్వరరావు, నిఖిల్, కైలాసం, ఖాజా హుస్సేన్, రాజేష్, అనిల్, సాయికిరణ్, సూర్యా (సంధ్య వర్షిని పెర్ల్ అపార్ట్మెంట్ వాసులు) దామోదర సుభాష్, చంద్రబోస్, విద్యాసాగర్, ప్రవీణ్, నాగేశ్వరరావు( వాసవి నందనం అపార్ట్మెంట్ వాసులు )కృష్ణ పోకల, రామకృష్ణ, సంతోష్, వినోద్ (అంబియన్స్ అపార్ట్మెంట్ వాసులు) కరుణాకర్, ఎర్రబల్లి, రాహుల్ కుటల, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!