ePaper
Monday, August 3, 2026
📄 ePaper
Homeమహేశ్వరంపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే న్యాయం

పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే న్యాయం

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య :

పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. మహేశ్వరం, సుభాన్ పూర్, మాణిక్యమ్మగూడ, చిన్నతూర్ప, డబిల్ గూడ గ్రామాల్లోని ఇందిరమ్మ లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదోడికి కూడు, గూడు కల్పించేది నాటి నుంచి నేటి వరకు ఇందిరమ్మ రాజ్యంలోనే అని పేర్కొన్నారు. పేదలకు కూడు (ఆహార భద్రత), గూడు (ఇందిరమ్మ ఇళ్లు) సమకూర్చడమే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. సన్న బియ్యం ఇస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. దశాబ్ద కాలంలో ఒక్క ఇల్లు కట్టించని బీఆర్ఎస్ కు కాంగ్రెస్ సర్కార్ ను విమర్శించే అర్హత లేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి, తీగల అనితా రెడ్డి, సునీత అధ్యా నాయక్ , సీహెచ్. యాదయ్య, ఆవుల యాదయ్య పలువురు నేతలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!