ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeమహేశ్వరంప్రజా సమస్యలు పరిష్కరించాలి 

ప్రజా సమస్యలు పరిష్కరించాలి 

📰 Generate e-Paper Clip

జోనల్ కమిషనర్ చంద్రకళకు వినతి

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : 

ప్రజా సమస్యలు పరిష్కరించాలని జోనల్ కమిషనర్ చంద్రకళకు బీజేపీ రాష్ట్ర నేత కొలన్ శంకర్ రెడ్డి బీజేపీ శ్రేణులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కోలన్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ లోని బడంగ్ పేట సర్కిల్ పరిధిలోని 60 వ డివిజన్ లోని దాతునగర్, సాయి గణేష్ నగర్, సుభాష్ చంద్రబోస్ కాలనీ, సాయి కృప కాలనీ, జయభారత్ నగర్ ఆఫీసర్స్ కాలనీ లలోని గుంతలు గుంతలు గా మారిన రోడ్లతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. రహదారులకు మరమ్మతులు చేయాలన్నారు. పార్క్ ఏరియాలో పండగల ఉత్సవాల కొరకు షెడ్ నిర్మాణం చేపట్టాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు, దోమల నివారణకు ఫాగ్ చేయాలని, తదితర అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతూ ఎంపీ ఈటల రాజేందర్ ఇచ్చిన వినతి పత్రాన్ని శంషాబాద్ జోనల్ కమిషనర్ చంద్రకళకి అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు సత్యప్రకాష్ జీ, గంగవరం సురేష్, జై కాంత్ గుప్తా, దినేష్ , తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!