ePaper
Monday, August 3, 2026
📄 ePaper
Homeకుత్బుల్లాపూర్వైభవంగా శ్రీ భీమేశ్వరస్వామి దేవాలయ ప్రథమ వార్షికోత్సవం

వైభవంగా శ్రీ భీమేశ్వరస్వామి దేవాలయ ప్రథమ వార్షికోత్సవం

📰 Generate e-Paper Clip

పాల్గొన్న మేడ్చల్ మల్కాజ్ గిరి డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ 

మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ :

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం బాలాజీ లే-అవుట్ నందు శ్రీ భీమేశ్వర దేవాలయం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ హాజరై స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భీమేశ్వర స్వామి ఆశీస్సులు కృపా కటాక్షాలు చల్లని దీవెనలు ఆయురారోగ్యాలతో కూడిన జీవితాన్ని ప్రజలందరికీ ప్రసాదించాలని ఆకాంక్షించాలి, అదేవిధంగా భీమేశ్వర స్వామి వార్షికోత్సవాలు ఇంత ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి ఆ స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు అంజన్న, శ్రీనివాస్, వెంకట్ కుమార్, వేణు, బాలాజీ, రామక్రిష్ణ, చైతన్య మరియు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!