ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeమహేశ్వరందేశానికి తలమానికంగా నూతన ఫ్యూచర్ సిటీ 

దేశానికి తలమానికంగా నూతన ఫ్యూచర్ సిటీ 

📰 Generate e-Paper Clip

ఫార్మా వద్దు – గ్రీన్ ఫార్మా ముద్దు అంటూ నినాదించిన కాంగ్రెస్ శ్రేణులు

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :

భారతదేశానికి తలమానికంగా ఉండేలా, ప్రతి ఒక్కరికీ భవిష్యత్ నిచ్చే నగరంగా ఫ్యూచర్ సిటీ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నధ్ధమవుతోందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. ఈనెల 10న సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీపీసీసీ మెంబర్ దేప భాస్కర్ రెడ్డి, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, పీసీసీ కార్యదర్శి యెల్మేటి అమరేందర్ రెడ్డి మాజీ జెడ్పిటీసీ బొక్క జంగారెడ్డి ఇతర ముఖ్య నాయకులతో కలిసి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ.. ఈ నెల 10వ తేదీన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డెవలప్మెంట్ అథారిటీ, స్కిల్ యూనివర్సిటీల ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుందన్నారు. పాలన భవనం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, స్కిల్ యూనివర్సిటీ భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. హైదరాబాద్ పట్టణంలో రకరకాల సమస్యలు ఉన్నాయన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నలుమూలల నుంచి మన హైదరాబాద్ కి రావాలని చాలామంది ఇటువైపు చూస్తున్నారన్నారు. అలా చాలామంది హైదరాబాదు వస్తే రోడ్లు, డ్రైనేజీ సమస్య అన్ని రకాల సమస్యలు నిలయంగా మారుతాయన్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నూతన పట్టణం నిర్మాణం చేస్తే సమస్య తీరుతుందని రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు ఫ్యూచర్ సిటీ నిర్మాణం కొనసాగుతుందన్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, మెడికల్ హబ్, స్పోర్ట్స్ హబ్, స్కిల్ యూనివర్సిటీల భవనాలు అందుబాటులోకి వస్తే ఫ్యూచర్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఫ్యూచర్ సిటీలో ఆహ్లాదకరమైన వాతావరణం అన్ని రకాల సదుపాయాలు మౌలిక వసతులు సమకూరుతాయన్నారు. రహదారుల, డ్రైనేజీ తదితర సమస్యలు ఉండవన్నారు. భారతదేశానికి కొత్త పట్టణం నిర్మాణం జరుగుతుందన్నారు. మనం ఇతర దేశాలకు వెళ్లి నూతన పట్టణాలను చూసి వాహ వాహ అంటామన్నారు. అలా కాకుండా ఇతర దేశస్తులు అభివృద్ధి చెందిన దేశస్థులు మన దేశానికి వచ్చి మన ఫ్యూచర్ సిటీ పట్టణాన్ని చూసి వాహ వాహ అనేలా ఆశ్చర్యం చెందాలని సీఎం రేవంత్ రెడ్డి నూతన పట్టణాన్ని నిర్మించబోతున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రపంచ స్థాయి విద్య, వైద్య సంస్థలు రానున్నాయని తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. హైదరాబాద్ పై ఒత్తిడి తగ్గించేందుకు కొత్త పట్టణం కట్టనున్నామని లక్ష్మారెడ్డి తెలిపారు. మరో రెండేళ్లలో ఫ్యూచర్ సిటీ లో అత్యాధునిక సౌకర్యాలతో సౌలతులు కల్పించి మహానగరాన్ని నిర్మిస్తామని కేఎల్ఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కృష్ణ నాయక్, సరికొండ మల్లేష్, రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ శ్రీధర్, తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి కార్యదర్శి గదగూటి మహేందర్ ముదిరాజ్, టీపీసీసీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డి, అల్లే కుమార్, ఐఎన్ టీయూసీ నడికుడి శివ, బొక్క భూపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య, శివగల యాదయ్య, సురేందర్, బోయపల్లి గోవర్ధన్ రెడ్డి, మదనపాల్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, దంతోజు నరసింహచారి, రజనీకాంత్, నిరంజన్,వెంకటేశ్వర్లు మండల అధ్యక్షులు, సర్పంచులు, వార్డ్ మెంబర్లు కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!