ePaper
Tuesday, August 4, 2026
📄 ePaper
Homeమహేశ్వరంబాలిక అదృశ్యం 

బాలిక అదృశ్యం 

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :

ఇంట్లో అక్కకి మందులు తీసుకొస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళిన మైనర్ బాలిక అదృశ్యమైన సంఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సోయల్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీస్ స్టేషన్ పరిధిలోని షాహినగర్ లో న్యూ జంజం బేకరీ వెనుక వైపున ఉన్న వాది యే ఓమర్ నందు తన తల్లిదండ్రులతో నివాసం ఉంటున్నది. ఈ నెల 5న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తన సోదరి ఆరోగ్యం సరిగా లేనందున బాలిక మహేక్ మెడిసిన్స్ తీసుకొస్తా అని చెప్పి ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. మెడిసిన్స్ తీసుకొస్తా అని చెప్పి ఇంట్లో నుండి వెళ్లిన మహెక్ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, బంధువుల వద్ద ఆరా తీయగా ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో బాలిక తల్లి జూలీషా బేగం బాలాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!