విద్యుత్ శాఖ ఏడిఇ కే. రాజు
మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట, ప్రతినిధి నార్కెట్‌పల్లి శైలేష్ కుమార్ :
నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఫలక్ నుమా జోన్ విద్యుత్ శాఖ సబ్ స్టేషన్ అడిషనల్ డివిజినల్ ఇంజనీర్ (ఏడిఇ) కే. రాజు సూచించారు. కరెంట్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో వెళ్ళొద్దని, తెగిపోయిన వైర్ల దగ్గరకు, నీరు నిల్వ ఉన్న చోట విద్యుత్ లీకేజ్ ప్రమాదం ఎక్కువ ఉంటుందని, వర్షంలో తడిచిన చేతులతో స్విచ్ బోర్డులు, ప్లగ్లు ముట్టుకోవడం ప్రమాదకరమని, పిల్లలను ఒంటరిగా బయటకు పంపొద్దని ఆయన సూచించారు. కరెంట్ స్తంభాల సమీపంలో గమనిస్తూ నడవడం మంచిదని, ట్రాన్స్ ఫారంలో మంటలు, మెరుపుల కనిపిస్తే, ఏదైనా సమస్య ఉంటే చుట్టూ పక్కన ఉన్న వైర్లు తెగిపోయి ఉంటే వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఫ్యూజ్ ఆఫ్ కాల్ (ఎఫ్ఓసి) చాంద్రాయణగుట్ట- 8712470812, ఏఇ 8712470723, ఫలక్ నుమా- 8712470811, ఏఇ 8712470811, చిత్రినాన- 8712570813, ఏఇ 8712470725, మీ యొక్క ఏరియాకి సంబంధించిన నంబర్లకు ఫిర్యాదు చేయాలని, సిబ్బంది వెంటనే మరమ్మతులు చేస్తారని, విద్యుత్ సమస్యలు ఉంటే వెంటనే 1912 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ప్రజలు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

