ప్రభుత్వ స్థలానికి ఫెన్సింగ్ వేసిన రెవెన్యూ అధికారులు
తక్షణమే ఈ స్థలం మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ కార్యాలయం వినియోగించాలని డిమాండ్
మన తొలివెలగు కుత్బుల్లాపూర్ ప్రతినిధి టి రమేష్ :

ప్రభుత్వ భూమిలో మైసా కన్స్ట్రక్షన్ కోసం అక్రమ రహదారి అనే అంశం పై మన తొలివెలుగు దినపత్రికలో ప్రచురించిన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. ప్రభుత్వ స్థలానికి అధికారులు ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ సూచిక బోర్డును ఏర్పాటు చేశారు.

పేట్ బషీర్బాద్ పరిధిలోని సర్వే నంబర్ 23లో ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని మైసా కన్స్ట్రక్షన్ ప్రాజెక్టుకు అప్రోచ్ రోడ్డుగా వినియోగిస్తున్నారనే అంశంపై విచారణ జరిపిన అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. తక్షణమే ఈ స్థలం మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ కార్యాలయం వినియోగించాలని సామాజిక కార్యకర్త ఆకుల సతీష్ డిమాండ్ చేశారు.

