మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జంగిటి రవీందర్ :
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనంతారం గ్రామంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద అనంతారం, తాజ్‌పూర్, హనుమాపురం, మన్నెవారి పంపు ప్రాంతాలకు చెందిన రైతులు భారీగా ఆందోళన చేపట్టారు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సబ్‌స్టేషన్‌ను ముట్టడించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇస్తామని చెప్పి ప్రస్తుతం ఉదయం 5.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మాత్రమే త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ పనులు పూర్తిస్థాయిలో సాగాలంటే 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా అవసరమని తెలిపారు. ధర్నాలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 12 గంటలకే పరిమితం చేసిందని ఆరోపించారు. మూడు రోజులలోగా 24 గంటల విద్యుత్ సరఫరా పునరుద్ధరించకపోతే భువనగిరి విద్యుత్ డీఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం రైతులు, ప్రజాప్రతినిధులు కలిసి విద్యుత్ శాఖ డీఈకు వినతిపత్రం సమర్పించి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిందం మల్లికార్జున్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ పల్లెపాటి హరిబాబు, పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ గుమ్మడి సురేందర్ రెడ్డి, టీఆర్‌ఎస్ యువ నాయకుడు పోల ప్రవీణ్, వార్డు సభ్యుడు గుమ్ముల గణేష్, చిగురు పల్లి సోమయ్య, తాజ్‌పూర్ ఉపసర్పంచ్ ఓరుగంటి కృష్ణ, సామల చంద్రమోహన్, పల్లెపాటి నర్సింహ, కొత్తపెళ్లి కిషన్ రైతులు చింతల నర్సిరెడ్డి, బద్దం మల్లారెడ్డి, మచ్చగారు వెంకటేష్, కావడి నవీన్, మన్నే వారి పంపు పైళ్ల కొండల్ రెడ్డి, బొమ్మరపు బాలరాజు, మహేష్, యాకూబ్, మహమ్మద్, చింతల మహేందర్, బండిరాల మహేష్, కావడి ఆగులు , కొయ్యడ లక్ష్మయ్య, మాదిరే కొమురయ్య, కావడి ఎల్లేష్ ,గుజ్జ నరసింహ, పల్లెపాటి లింగం, మేడ బోయిన శ్రీశైలం, కొలిచేలిమి చిన్న, మేడబోయినా నరేష్ మచ్చ సత్తయ్య పాల్గొన్నారు.

