మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యని దారుణంగా నరికి చంపిన భర్త
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
కలిసి జీవితాంతం తోడుంటానని హామీ ఇచ్చిన భర్తే భార్య పట్ల కాలయముడయ్యాడు. భార్యపై అనుమానం వచ్చి గొడ్డలితో నరికి హత్య సంఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మీర్ పేట్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా శివన్నగూడెం కి చెందిన నల్లబోతుల వసంత (52) భర్త నర్సింహ (60) దంపతులు బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చి బీ.ఎన్ రెడ్డి నగర్ లో నివాసం ఉంటున్నారు. బార్య మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్తకు విషయం తెలవడంతో పలుమార్లు భార్యను మందలించాడు. కానీ ఆమె మాత్రం భర్త చెప్పిన విషయాన్ని పట్టించుకోలేదు. ఈ నెల 28 న మంగళవారం తెల్లవారు జామున భర్త పనికి వెళ్లి ఇంటికి వచ్చిన సమయంలో భార్య వేరే వ్యక్తితో కలిసి ఉండడం చూసి తట్టుకోలేకపోయాడు. ఇంట్లో ఉన్న గొడ్ఠలిని తీసుకొని వచ్చే సరికి అక్రమ సంబంధం ఉన్న వ్యక్తి అక్కడి నుండి పారిపోయాడు. కోపోద్రిక్తుడైన ఆమె భర్త భార్యను గొడ్డలితో నరికి చంపేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మీర్ పేట్ పోలీసులు తెలిపారు.
