మన తొలివెలుగు , మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
తెలంగాణ రాష్ట్ర సేన రాష్ట్ర అధ్యక్షురాలు కవిత తన కన్న తండ్రిని మన మనిషి కాదు మర మనిషి అని అన్నారు. కన్న తండ్రి మనసు బాధపడుతుంది” అంటూ రాజకీయాల కోసం మొసలి కన్నీరు కారుస్తున్న బీఆర్ఎస్ నాయకులకు, వారి అనుయాయులకు తెలంగాణ రాష్ట్ర సేన రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కప్పాటి పాండు రంగారెడ్డి కొన్ని పదునైన ప్రశ్నలు సంధించారు. కందుకూరు మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. పెంపుడు జంతువుల్లా యజమానుల మెప్పు కోసం మొరిగే వారు, వాస్తవాలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సస్పెన్షన్ వేటు వేసినప్పుడు తండ్రి ప్రేమ ఏమైందన్నారు. సొంత బిడ్డ కవితను పార్టీ నుండి సస్పెండ్ చేసినప్పుడు, ఒక తండ్రిగా కేసీఆర్ కనీసం బాధ అనిపించలేదా..? అని ప్రశ్నించారు. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు తండ్రి మనసు ఎక్కడకు పోయింది? అన్నారు.
దుబాయ్‌లో ఉండే కొందరు కేటుగాళ్లు కవితను అనరాని మాటలు అంటుంటే, సాక్షాత్తు తండ్రిగా, గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కి బాధ కలగలేదా? ఎందుకు వారిపై చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు.
కేవలం రాజకీయ కక్షతో కవితను 6 నెలల పాటు తీహార్ జైల్లో పెట్టినప్పుడు, ఆ తండ్రి మనసు విలవిల లాడలేదెందుకు? కన్న కూతురు జైలు పాలవుతుంటే కనీసం స్పందించలేని నిస్సహాయతకు కారణమేంటి? నా మీద కుట్రలు జరుగుతున్నాయి” అని కవిత స్వయంగా బీఆర్ఎస్ భవన్‌లోనే ఆవేదన వ్యక్తం చేసినప్పుడు, ఆ మాటలు విన్న కేసీఆర్ కి బాధ కలగలేదా? అన్నకు రాఖీ కట్టడానికి వస్తున్నా” అని చెల్లెలు చెబుతుంటే, ఆమెను చూడకుండా పారిపోయిన కేటీఆర్‌ను చూసి ఒక తండ్రిగా కేసీఆర్ ఎందుకు బాధపడలేదు? ఇది ఏ రకమైన కుటుంబ అనుబంధం? సొంత ఇంటి అల్లుడి ఫోన్‌నే ట్యాపింగ్ చేయించినప్పుడు, ఆ తండ్రికి.. లేదా.. ఆ మామకు అల్లుడిపై కనీస నైతిక బాధ అనిపించలేదా?
తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నప్పుడు, తన బిడ్డ గౌరవానికి భంగం కలుగుతుంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు?
ఇన్ని అవమానాలు, ఇన్ని కుట్రలు కళ్ళముందే జరుగుతున్నా, కనీసం స్పందించలేకపోతున్నానని కేసీఆర్ ఎప్పుడైనా బాధపడ్డారా? నిజమైన బాధ బిడ్డ జైలుకు వెళ్ళినప్పుడు ఉండాలి, సొంత పార్టీలోనే అవమానాలు ఎదురైనప్పుడు ఉండాలి. అంతేకానీ, రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు ‘తండ్రి మనసు’ అంటూ డ్రామాలు ఆడటం ఆపాలన్నారు. వీటి అన్నింటినీకి ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం బీఆర్ఎస్ నాయకులకు ఉందా?” అని కప్పాటి పాండురంగా రెడ్డి సవాల్ విసిరారు.
