ePaper
Sunday, May 3, 2026
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్అక్రమ సంబంధం పెట్టుకుందని భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

అక్రమ సంబంధం పెట్టుకుందని భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

📰 Generate e-Paper Clip

మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యని దారుణంగా నరికి చంపిన భర్త

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

కలిసి జీవితాంతం తోడుంటానని హామీ ఇచ్చిన భర్తే భార్య పట్ల కాలయముడయ్యాడు. భార్యపై అనుమానం వచ్చి గొడ్డలితో నరికి హత్య చేసిన సంఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మీర్ పేట్ పోలీసులు , స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా శివన్నగూడెం కి చెందిన నల్లబోతుల వసంత (52) భర్త నర్సింహ (60) దంపతులు బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చి బీ. ఎన్ రెడ్డి నగర్ లో నివాసం ఉంటున్నాడు. వీరికి కుమారుడు, కూతురు సంతానం. భార్య వసంత, భర్త నర్సింహలు ఇద్దరే కలిసి ఉంటున్నారు. వసంత ఇండ్లల్లో పాచీ పనులు చేస్తుండగా, భర్త నర్సింహ వృత్తి రీత్యా లేబర్, కాగా భార్య భర్తల మధ్య తరచు గొడవలు జరిగేవి. భార్యపై భర్తకు ఎప్పటి నుంచో మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానం ఉంది. అనుమానం పెనుభూతంగా మారింది. ఎప్పటిలాగానే భార్య వసంత పాచి పనుల కోసం ఇంట్లో నుంచి బుధవారం తెల్లవారు జామున బయటికి వెళ్లింది. అమెను భర్త వెంబడించాడు. సరిగ్గా ఉదయం 5.45 గంటల ప్రాంతంలో వసంత ఓ ఇంటి వాకిలి ఊకుతుండగా వెంట తెచ్చుకున్న గుడ్డలతో ఒక్కసారిగా ఆమె భుజం, మెడ భాగాలలో పలుమార్లు గొడ్డలితో నరికి హతమార్చాడు. స్థానికుల ద్వారా సమచారం అందుకున్న మీర్ పేట్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. శవ పంచనామ నిర్వహించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కాసేపటికే మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో నిందితుడు నర్సింహ లొంగిపోయినట్లు సమాచారం. సమాచారం అందుకున్న కుమారుడు మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అనుమానంతోనే భార్యను హతమార్చినట్లు నిందితుడు పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!