లేమూరు గ్రామ సర్పంచ్ మేఘనాథ్ రెడ్డి
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :
లేమూరు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరం బాధ్యతగా పని చేద్దామని అధికారులకు, యువతకు, ప్రజలకు, గ్రామ సర్పంచ్ ఎలుక మేఘనాధ్ రెడ్డి పిలుపునిచ్చారు. కందుకూరు మండల పరిధిలోని లేమూర్ గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు గ్రామ ప్రజలు తమ అభిప్రాయాలు, సమస్యలు, సూచనలను తెలియజేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు స్వరూప వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, వాటి నివారణ చర్యలు, ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలు, టీకాల గురించి వివరించారు. వ్యవసాయ శాఖ అధికారి స్థానిక పరిస్థితులకు అనుకూలమైన వర్షాధార పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. మహేశ్వరం ఏసీపీ జానకి రెడ్డి సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు, డ్రగ్స్ ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సైబర్ మోసాలకు గురైన వారు వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియపై ఈఆర్వోలు, బీఎల్వోలు వివరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మేఘనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ పెద్దలు అధికారులు సూచించిన ప్రతి అంశాన్ని గ్రామాభివృద్ధి కోసం పరిగణలోకి తీసుకొని అందరూ సహకరించాలని కోరారు. గ్రామ ప్రజలందరూ వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండి, గ్రామ పరిశుభ్రత ఆరోగ్య పరిరక్షణకు సహకరించాలిన్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంటి పరిసర ప్రాంతాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. దోమల నివారణ కోసం దోమతెరలు వాడాలన్నారు. మురుగు కాలువలు, డ్రైనేజీలలో చెత్త వేయకుండా చూడాలన్నారు. వర్షాకాలంలో తాగునీటిని మరిగించి వినియోగించాలని ప్రజలను కోరారు. చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గ్రామంలో ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొనే సామర్థ్యం మన గ్రామ ప్రజలకు ఉందని తెలిపారు. గ్రామాన్ని పరిశుభ్రంగా చూసుకుందాం అన్నారు తడి, పొడి చెత్తను వేరుగా ఇవ్వాలన్నారు. ప్రతి ఇంటి వారు తమ తల్లిదండ్రుల పేరుతో ఒక మొక్కను నాటి సంరక్షించాలన్నారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరం బాధ్యతగా ఉండి కలిసికట్టుగా పని చేద్దామని ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సరిత, ఇతర అధికారులు ప్రజలు పాల్గొన్నారు.

