మన తొలి వెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :
మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన్నగారి లక్ష్మా రెడ్డి సహకారంతో ప్రజా సమస్యలు తీర్చటమే తన ప్రథమ కర్తవ్యమని టీపీసీసీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డి తెలిపారు. ప్రశాంతి హిల్స్ 58వ డివిజన్ అయోధ్య నగర్ కాలనీ లో పలు సమస్యలవల్ల స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులను కాలనీ అసోసియేషన్ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఆయన కాలనీలో పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్డు, డ్రైనేజీ తదితర సమస్యలను సామిడి గోపాల్ రెడ్డికి స్థానికులు విన్నవించుకున్నారు. ప్రజల సమస్యలను విన్న ఆయన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిస్కారం చూపుతానని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ముఖ్య సలహాదారులు బళ్లారి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి వేముల రాము, మాజీ ప్రధాన కార్యదర్శి కూర రమేష్, ఉపాధ్యక్షులు కృష్ణ మూర్తి, భాస్కర్రావు, మహేందర్ గౌడ్ కమిటీ సభ్యులు యాదగిరిరావు, అడపా రవి, సుదర్శనగౌడ్, ఉదయ్ కాంగ్రెస్ నేతలు కాంటెస్టెడ్ కార్పొరేటర్ నక్క బాలకృష్ణ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గడివేముల కృష్ణ, గుడేటి నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

